అది శుక్రవారం, టైం నాలుగున్నర. అప్పుడే వెన్డింగ్ మెషీన్ నుండి హాట్ హాట్ క్యాపిచినో తీస్కొని తన డెస్క్ దగ్గరికి వచ్చి కూసున్నడు రాహుల్. వచ్చి మొబైల్ చూసేసరికి మూడు మిస్డ్ కాల్స్, చేసింది కౌశిక్. "వీడేంది ఎన్నడ్లేంది ఇట్ల ఆగకుంట మూడుసార్లు కాల్ చేసిండు" అని అనుకోని ఎంబడే కాల్ బ్యాక్ కొట్టిండు. రాహుల్: "ఏందిర కౌశిక్ ఫోన్ చేశినవ్ " "హలో... హలో .." రెండు సార్లు అంటే కానీ రిప్లై రాలె . కౌశిక్:"ఎమ్లెరా ... ఏడున్నవ్" అని చానా లో వాయిస్ ల అడిగుండు కౌశిక్. రాహుల్:"గీ టైం ల ఏడుంటార ఆఫీస్ లనే ఉన్న చెప్పు.." కౌశిక్: "ఎప్పుడొత్తానవ్ రూం కి" రాహుల్: "మా లీడ్ ఐదింటికి మీటింగ్ పెట్టిండ్ర, అదయిపోంగనే వత్త... ఏడుగంట్ల వరకు ఉంట .. కూరగాయలేమన్న పట్కరావాల్న....? కౌశిక్: వద్దురా వచ్చేటప్పుడు ఒక నాలుగు బీర్లు పట్కరార .. మూడ్ మంచిగ లేదియాలా... రాహుల్: ఏమయిందిరా స్నేహ తోని మల్లెమన్న లొల్లయిందా ? కౌశిక్ : అదేంలేదుర నువ్వయితే రూమ్ కి రా.. వచ్చినంక చెప్తా... రాహుల్: సరే.. సరే... తొందరగనే వస్త ల...