పెళ్లి చూపులు సినిమా చూశినక్క ఒక్క విషయం అర్ధమైంది. అర్ధం పర్ధం లేని పాటలు, ఫైట్లు, కుళ్ళు జోకులు, హీరోయిన్ ఎక్పోసింగ్ ఉన్న సినిమాలు జనాలు ఏ ఆప్షన్స్ లేకనే వాటిని చూస్తూ హిట్ చేస్తున్నరని. ఒక సింపుల్ కథ ని జనాలకి కనెక్ట్ అయ్యేటట్టు తీస్తూ, కొంచెం ఎంటర్టెయిన్ చేస్తూ తీస్తే జనాలు ఆదరిస్తరని పెళ్లి చూపులు ప్రూవ్ చే శింది ఇంజనీరింగ్ అతి కష్టం మీద కంప్లీట్ చేసి , కొద్ది రోజులు కాల్ సెంటర్ ల పని చేసి , డాడీ కి బయపడి కుకింగ్ ని కెరీర్ గ చేసుకోడానికి ముందెనుక ఆడుతున్న క్యారెక్టర్ ల హీరో కనిపిస్తడు. బిడ్డకు తొందరంగా పెళ్లి చేసి పంపించాలన్న తండ్రి బాద భరించలేక , ఆస్ట్రేలియ పోవడానికి అవసరమయ్యే పైసల్ సంపాదించడానికి తన దగ్గరున్న ట్రక్కు ని ఫుడ్ ట్రక్కుగా మార్చే బిజినెస్ పార్టనర్ కోసం చూసే క్యారెక్టర్ ల హీరోయిన్ కనిపిస్తది. వీళ్లిద్దరు ఎట్ల కలుస్తరు, ఎట్ల వాళ్ళ వాళ్ల లైఫ్ టర్న్ తీస్కుంటది అనేదే సినిమా స్టోరీ. ప్రశాంత్ క్యారెక్టర్ ల హీరో విజయ్ దేవరకొండ ఆక్టింగ్ చాలా క్యాషువల్ గ ఎక్కడ ఓవర్ ఆక్టింగ్ చెయ్యకుంట మంచిగుంటది. చిత్ర క్యారెక్టర్ ల హీరోయిన్ రీతూ వర్మ ఆక్టింగ్ కూడా చాల