పెళ్లి చూపులు సినిమా చూశినక్క ఒక్క విషయం అర్ధమైంది. అర్ధం పర్ధం లేని పాటలు, ఫైట్లు, కుళ్ళు జోకులు, హీరోయిన్ ఎక్పోసింగ్ ఉన్న సినిమాలు జనాలు ఏ ఆప్షన్స్ లేకనే వాటిని చూస్తూ హిట్ చేస్తున్నరని. ఒక సింపుల్ కథ ని జనాలకి కనెక్ట్ అయ్యేటట్టు తీస్తూ, కొంచెం ఎంటర్టెయిన్ చేస్తూ తీస్తే జనాలు ఆదరిస్తరని పెళ్లి చూపులు ప్రూవ్ చే శింది
సినిమా మొత్తం యూత్ కి కనెక్ట్ అయ్యేలా తీశిండు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇంట్ల డాడీ తోటి తిట్లు తినడం, నైట్ తాగొచ్చి ఫ్రెండ్ రూమ్ ల పండుకోవడం, గల్లీ పిలగాండ్ల తోని క్రికెట్ ఆడుకోవడం, ఇటువంటి సీన్లు బాగా కనెక్ట్ అయితయ్. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రాశిన మాటలు చాలా సింపుల్ గా మనం రోజూ మాట్లాడుకునే మాటల్లెక్కనే ఉంటయి. తెలంగాణ యాస లో మాటలు రాశే డైరెక్టర్లు పెద్దగ లేరనే జెప్పుకోవాలె ఇండస్ట్రీల. తరుణ్ భాస్కర్ ఇన్స్పిరేషన్ తోటి ఇంకొన్ని సినిమాలల్ల ఇట్లాంటి మాటలు ఇనబడాలని కోరుకుందాం.
ఇంజనీరింగ్ అతి కష్టం మీద కంప్లీట్ చేసి , కొద్ది రోజులు కాల్ సెంటర్ ల పని చేసి , డాడీ కి బయపడి కుకింగ్ ని కెరీర్ గ చేసుకోడానికి ముందెనుక ఆడుతున్న క్యారెక్టర్ ల హీరో కనిపిస్తడు. బిడ్డకు తొందరంగా పెళ్లి చేసి పంపించాలన్న తండ్రి బాద భరించలేక , ఆస్ట్రేలియ పోవడానికి అవసరమయ్యే పైసల్ సంపాదించడానికి తన దగ్గరున్న ట్రక్కు ని ఫుడ్ ట్రక్కుగా మార్చే బిజినెస్ పార్టనర్ కోసం చూసే క్యారెక్టర్ ల హీరోయిన్ కనిపిస్తది. వీళ్లిద్దరు ఎట్ల కలుస్తరు, ఎట్ల వాళ్ళ వాళ్ల లైఫ్ టర్న్ తీస్కుంటది అనేదే సినిమా స్టోరీ.
ప్రశాంత్ క్యారెక్టర్ ల హీరో విజయ్ దేవరకొండ ఆక్టింగ్ చాలా క్యాషువల్ గ ఎక్కడ ఓవర్ ఆక్టింగ్ చెయ్యకుంట మంచిగుంటది. చిత్ర క్యారెక్టర్ ల హీరోయిన్ రీతూ వర్మ ఆక్టింగ్ కూడా చాలా బాగుంటది. డైరెక్టర్ చాలా అందంగా డీసెంట్ గా చూపించిండు.సినిమా మొత్తానికే హైలైట్ గా హీరో దోస్త్ క్యారక్టర్ ఉంటది. తెలంగాణ యాసలో మాట్లాడి అందర్నీ చానా బాగా ఎంటర్టైన్ చేసిండు కౌశిక్ రోల్ చేసిన ప్రియదర్శి. "డబల్ రేట్ ల నేన్ మందెప్పుడు కొన్లే తెల్సా", ఇజ్జత్ మొత్తం మన్నుల కలుస్తద్ " "నా సావు నేను సస్తా నీకెందుకు", ఇట్లాంటి డైలాగ్ లకి టాకీస్ ల మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకొక ఫ్రెండ్ విష్ణు క్యారెక్టర్లొ అభయ్ ఆక్టింగ్ కూడా చాలా క్యాషువల్ గ ఒక రూమ్మేట్ ఎట్లుంటాడో అట్లా ఉంటది.కానీ కొన్ని సీన్స్ లొ తన డైలాగ్స్ క్లియర్ గ వినపడవు. ఈ క్యారెక్టర్ మీద డైరెక్టర్ ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది.
వివేక్ సాగర్ చేసిన పాటలు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా కు చానా ప్లస్ అయ్యింది. పాటలు సినిమా ల కాల్షిపోయినట్లె ఉంటయి. పాట రాంగనే సీట్లకేలి లేశి పోవుడనేది వుండది. సింక్ సౌండ్ అనే కొత్త టెక్నాలజీ ని కూడా యూజ్ చేసిండ్లు యీ సినిమాలో .
వివేక్ సాగర్ చేసిన పాటలు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా కు చానా ప్లస్ అయ్యింది. పాటలు సినిమా ల కాల్షిపోయినట్లె ఉంటయి. పాట రాంగనే సీట్లకేలి లేశి పోవుడనేది వుండది. సింక్ సౌండ్ అనే కొత్త టెక్నాలజీ ని కూడా యూజ్ చేసిండ్లు యీ సినిమాలో .
సినిమా మొత్తం యూత్ కి కనెక్ట్ అయ్యేలా తీశిండు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇంట్ల డాడీ తోటి తిట్లు తినడం, నైట్ తాగొచ్చి ఫ్రెండ్ రూమ్ ల పండుకోవడం, గల్లీ పిలగాండ్ల తోని క్రికెట్ ఆడుకోవడం, ఇటువంటి సీన్లు బాగా కనెక్ట్ అయితయ్. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రాశిన మాటలు చాలా సింపుల్ గా మనం రోజూ మాట్లాడుకునే మాటల్లెక్కనే ఉంటయి. తెలంగాణ యాస లో మాటలు రాశే డైరెక్టర్లు పెద్దగ లేరనే జెప్పుకోవాలె ఇండస్ట్రీల. తరుణ్ భాస్కర్ ఇన్స్పిరేషన్ తోటి ఇంకొన్ని సినిమాలల్ల ఇట్లాంటి మాటలు ఇనబడాలని కోరుకుందాం.
Comments
Post a Comment